అమరావతిలో శిల్పారామం నిర్మిస్తాం: మంత్రి అవంతి శ్రీనివాస్

  • ఏపీలో పర్యాటక అభివృద్ధికి అనేక వనరులు ఉన్నాయి
  • పర్యాటక పెట్టుబడులతో స్వర్గధామంలా మారుస్తాం
  • పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులు 
అమరావతిలో శిల్పారామం నిర్మిస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయని అన్నారు. పర్యాటక పెట్టుబడులతో రాష్ట్రాన్ని స్వర్గధామంలా మారుస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని, పర్యాటకం ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏపీలోని జిల్లాల్లో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ఈ శాఖకు బ్రాండ్ అంబాసిడర్ ను నియమిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో పర్యాటక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
mla
avanthi
bhimli
minister

More Telugu News